1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆటోనగర్ సూర్య అలాంటి సమయంలోనే

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

'వెన్నెల, ప్రస్థానం' చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు గడించిన దేవాకట్టా రూపొందిస్తున్న తృతీయ సినిమా ప్రయత్నం 'ఆటోనగర్ సూర్య'. నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్లుగా నిర్మాణం జరుపుకుంటూ. మధ్యలో ఆగిపోతూ. ఇలా ఏదో ఓ రూపంలో వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇన్నాళ్లు ఈ సినిమాకి పట్టిన గ్రహణం పోయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే. చేతికి అందొచ్చిన ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలా అన్న విషయంలో చిత్ర బృందం ఎంతో స్పష్టతతో ఉందీప్పుడు. వచ్చే నెలలోనే ఈ సినిమా వచ్చే అవకాశాలున్నా. అప్పుడు విడుదలయ్యే సినిమాలను (క్రేజ్ ఉన్నవే అనుకోవచ్చు) బట్టి. లభ్యమయ్యే థియేటర్లను బట్టి విడుదల తేది ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రకారం. సరైన ముహుర్తం కూడా ఈ సినిమాని ఫలితాన్ని మరింత ఘనంగా ఉంచేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.