1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

ఈ నెల 27న రానున్న ప్రేమించాలి

IndiaGlitz [Friday, February 14, 2014]
Comments

ఎస్ కె పిక్చర్స్ బ్యానర్ లో విడుదలకు సిద్ధమవుతున్న మరో అనువాద సినిమా 'ప్రేమించాలి'. సంతోష్, మనీషా యాదవ్ హీరోహీరోయిన్లు. 'నాపేరు శివ ఫేమ్' సుశీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు సురేష్ కొండేటి నిర్మాతగా అందిస్తున్నారు. సమన్య రెడ్డి. ఈ సినిమాకి సంబంధించి ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరిగింది.

నిర్మాత సురేష్ మాట్లాడుతూ 'సినిమాని ఈరోజు ప్రేమికులరోజు సందర్భంగా విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా విడుదల చేయలేకపోతున్నాం. సినిమాని ఈ నెల27న విడుదల చేయాలనుకుంటున్నాం. సినిమాకి సెన్సార్ లో క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది. ఇప్పటి యువతీ యువకులు ప్రేమ పేరుతో చేసే కొన్ని చిన్న తప్పులు కారణంగా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.

అనే మెసేజ్ ఈ సినిమా ద్వారా ఇస్తున్నాం. భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ సాహిత్యం సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాయి. యువన్ సంగీతం గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. ఇది వరకు నా బ్యానర్ లో వచ్చిన నా గత చిత్రాలను ఎలాగైతే ఆదరించారో ఈ సినిమాని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్రేమిస్తే కంటే ప్రేమించాలి ఇంకా పెద్ద సక్సెస్ కావాలి అని అన్నారు.

సమన్యరెడ్డి మాట్లాడుతూ 'సురేష్ ను వెలంటేన్స్ రాజా అనాలి. ఎందుకంటే అతనన్ని ప్రేమకథా చిత్రాలను అందించాడు. ఇది వరకు సురేష్, నేను కలిసి పిజ్జా సినిమా చేశాం. ఇప్పుడు ఇది రెండోసినిమా సుశీంద్రన్ సినిమాని చక్కగా తెరకెక్కించాడు.




Kotha Janta Valentines Day Poster








Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Balakrishna's 50th film completes 25 years
 Allu Arjun - Boyapati movie title
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 "'Uttama Villain' is a very special film"
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.