1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఓరి దేవుడోయ్ సినిమా ప్రారంభం

IndiaGlitz [Friday, November 29, 2013]
Comments

చేజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'ఓరి దేవుడోయ్'. కోటి తనయుడు రాజీవ్ హీరోగా, మదిరాక్షి, మోనిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవిశంకర్.వి నిర్మాత. శ్రీరామ్ వేగరాజు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి దాసరినారాయణరావు క్లాప్ నివ్వగా, డా.రామానాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈసందర్భంగా దర్శకుడు శ్రీరామ్ వేగరాజు మాట్లాడుతూ  'బాగా డబ్బు సంపాదించిన యువకుడు తన సమస్యలతో పాటు తన చుట్టూ ఉన్న వారి సమస్యలను ఎలా డీల్ చేశాడనేదే చిత్ర కథాంశం. కథను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాం' అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ 'కోటి గారి సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది. దాదాపు సంవత్సరం పాటు కథ గురించి చర్చించిన తర్వాతే షూటింగ్ ప్రారంభించాం. ఈరోజు నుంచి చిత్రీకరణ ప్రారంభిం చి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ని పూర్తిచేస్తాం' అని తెలిపారు




స్వామివివేకానందకి క్లీన్ యు



Other News


Swamy Vivekananda Completes Censor Process

Malligadu Marriage Bureau Audio Launched

This Race Gurram Wins Life Race





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.