close
Choose your channels

'కందిరీగ' లాగే 'మసాలా' కూడా..

Friday, October 4, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'దేవదాసు' వంటి ఘనవిజయం సాధించిన సినిమాతో హీరోగా చిరు ప్రాయంలోనే అడుగులు వేశాడు రామ్. ఆ తరువాత అతను చేసిన సినిమాల్లో 'రెడీ', 'కందిరీగ' మాత్రమే విజయవంతమైన చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. వాటి మధ్యలో వచ్చిన 'మస్కా ' ఫరవాలేదనపించుకుంది. రామ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో' మసాలా' ఒకటి. వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా హిందీలో విజయం సాధించిన 'బోల్ బచ్చన్'కి రీమేక్ గా రూపొందుతోంది.

ఈ సినిమాపై రామ్ చాలా ఆశలనే పెట్టుకున్నాడు. ఎందుకంటే.. ఇప్పటికే 'ఎందుకంటే ప్రేమంట', 'ఒంగోలు గిత్త' రూపంలో రెండు ఘోరపరాజయాలు తన కెరీర్ స్పీడ్ బ్రేకర్ లా మారాయి కాబట్టి. ప్రస్తుతం తాను చేస్తున్న 'మసాలా' తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని.. వెంకటేష్ తో కలిసి నటించడం అనే అంశం తనకు కలిసి వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు.

అంతేకాదు.. 'కందిరీగ'కి స్వరాలు అందించిన తమన్ నే ఈ సినిమాకి సంగీత దర్శకుడు కావడం.. అతను చేస్తున్న సినిమాలు సింహభాగం విజయమార్గంలోనే పయనించడం కూడా ఈ సినిమా వర్కవుట్ కి కారణంగా నిలుస్తుందని ఆశిస్తున్నాడు. అందుకే 'కందిరీగ' లాగే 'మసాలా' కూడా సక్సెస్ ఫుల్ మూవీగా పేరుతెచ్చుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాడు రామ్. రామ్ ఆశ నెరవేరాలని ఆకాంక్షిద్దాం.

Follow us on Google News and stay updated with the latest!