1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

జగన్నాయకుడు ఆడియో విడుదల

IndiaGlitz [Friday, April 04, 2014]
Comments

విజయాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వల్లూరి శకుంతల రెడ్డి సమర్పణలో వి.ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'జగన్నాయకుడు'. రాజా, బానుచందర్, సుమన్ కీలకపాత్రధారులు . ప్రమోద్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుక శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. తొలిసీడీను ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా...

రాజా మాట్లాడుతూ 'ఈనెల 25న చెన్నైలో లీలామహాల్ లో నా వివాహం జరగనుంది. 30న రిసెప్షన్ జరగనుంది. ఈ సందర్భంగా ఆడియో విడుదల కావడం ఆనందంగా ఉంది' అని అన్నారు.
నిర్మాత వి.ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ 'గతంలో కృష్ణ, శ్రీదేవిలతో భోగభాగ్యాలు అనే సినిమా చేశాను. మూడు తరాలకు సంబంధించిన కథ. తాత, తండ్రి, కుమారుడికి సంబంధించిన సినిమా. సందేశాత్మక సినిమా' అని తెలిపారు.

దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ  'సినిమాని గుడూరు పరిసరాల్లో తెరకెక్కించాం. సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు' అని తెలిపారు.

సంగీతదర్శకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ 'పాటలకు మంచి స్పందన వచ్చింది. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు' అని తెలిపారు.

ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ప్రసాద్ బాబు, కృష్ణభగవాన్, గౌతంరాజు, వినోద్, గుండు హనుమంతరావు ఆమని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్ కుమార్, కెమెరాః ఎన్.శ్రీనివాసరెడ్డి, నిర్మాతః వి.ఎ.పద్మనాభరెడ్డి, దర్శకత్వం: పి.చంద్రశేఖర్రెడ్డి.

Watch 'Jagannayakudu' Trailers
Samantha declares her support to Modi
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.