Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

టాలీవుడ్ టాప్ హీరోతో అనుష్క శర్మ

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

రబ్ నే బనాదే జోడీ సినిమాతో హిందీలో నాయికగా తొలి అడుగులు వేసి. తదనంతర కాలంలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అనుష్క శర్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమీర్ ఖాన్ తో పీ.కె అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో అమీర్, అనుష్కల నడుమ గాఢ చుంబన సన్నివేశాలున్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి.  ఇదిలా ఉంటే.. అతి త్వరలో అనుష్క శర్మ తెలుగులో ఓ సినిమా చేయబోతున్నదన్నది బాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న ఓ కథనం.

ప్రస్తుతం తెలుగులో నెం.1, నెం.2 హీరోలుగా వెలుగొందుతున్న కథానాయకుల సినిమాల్లో కథానాయికలకై అన్వేషణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాల దర్శకనిర్మాతలు అనుష్క శర్మని సంప్రదించారని విశ్వసనీయ సమాచారం. వీటిలో ఓ సినిమాకి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని. దానికి సంబంధించిన అధికారక సమాచారం త్వరలోనే వెలువడుందని హిందీ సినిమా వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

దానికి తగ్గట్టే. ప్రాంతీయ భాషా చిత్రంలో అనుష్క శర్మ అంటూ తాజాగా అక్కడ హెడ్ లైన్స్ సైతం వస్తున్నాయి కూడా. అనుష్క శర్మ  తెలుగు సినిమాల ఎంట్రీ నిజమైతే గనుక ఇక్కడి హీరోయిన్ లకు  టెన్షన్ మొదలవడం ఖాయం. పెర్ ఫార్మెన్స్ లోనూ.. ఎక్స్ పోజింగ్ లోనూ ఈ అమ్మడికి తిరుగులేదన్నదే అందుకు కారణం. అన్నట్టు.. ఐదేళ్ల క్రితం విడుదలైన శౌర్యం సినిమా కోసం గోపీచంద్ చెల్లెలు పాత్రకి అనుష్క శర్మ రిజెక్ట్ కాబడిన సంగతి తెలిసిందే.




నేను ప్రయోగాలు చేయను - వినాయక్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Pawanism' release date fixed
 AP film chamber of commerce meeting in Vizag tomorrow
 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 Will Ram Charan work with Sreenu Vaitla ?
 Tamannaah's action sequences in 'Baahubali'
 30 years industry Prithvi as 'Boiling Star' Bablu
 'Ice Cream 2' audio released in Vijayawada
 'Race Gurram' producer for Boyapati - Srinivas film
 Actor Aadi to get married soon ?
 Kona Venkat to direct Ravi Teja ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.