close
Choose your channels

'ట్రాఫిక్' ట్రైలర్స్ లాంఛ్

Saturday, February 8, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ సూపర్స్టార్ సూర్య ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'ట్రాఫిక్'. శరత్కుమార్, రాధిక, ప్రకాష్రాజ్, చేరన్ నటీనటులు. గొల్డ్స్టార్ క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. తుమ్మలపల్లి సత్యనారాయణ నిర్మాత. షాహిద్ ఖాదర్ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్స్ విడుదల శనివారం హైదరాబాద్ లో జరిగింది. మేజో జోసెఫ్ సంగీతం అందించాడు. ఈ కార్యక్రమానికి వి.వి.వినాయక్, సి.కల్యాణ్, ప్రసన్నకుమార్, దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వి.వి.వినాయక్ ట్రైలర్స్ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా...వి.వి.వినాయక్ మాట్లాడుతూ 'బన్ని సినిమాతో శరత్ కుమార్గారితో నాకు మంచి రిలేషన్ ఉంది. వారి నిర్మాణంలో ఈ సినిమా తమిళంలో నిర్మితమైంది. తెలుగులో ఈ సినిమాని నేను చేద్దామనుకున్నాను. సూర్య చేసిన రోల్ ను ఎన్టీఆర్ లేక చరణ్ తో చేయించాలనుకున్నాను. కానీ ఇప్పుడు రామసత్యనారాయణ తెలుగులో సినిమాని విడుదల చేస్తున్నారు.ఈ సినిమా పెద్ద హిట్టయ్యి నిర్మాతకి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

చిత్రనిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ 'సి.కల్యాణ్, వి.వి.వినాయక్, రాధిక, శరత్కుమార్ ల సపోర్ట్ కారణంగానే ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు నెటివిటీకి దగ్గరగా ఉంటుంది. సూర్య ఒక మంచి రోల్లో నటించారు.హార్ట్ టచ్చింగ్ సబ్జెక్ట్. ఇది వరకు చాలా చిన్న సినిమాలు చేశాను. తొలిసారి డబ్బింగ్ సినిమా చేస్తున్నాను. అందరికి నచ్చే కాన్సెప్ట్ ఇది' అన్నారు.

Follow us on Google News and stay updated with the latest!