1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

తమన్ లో మార్పు వస్తోందా?

IndiaGlitz [Tuesday, September 17, 2013]
Comments

మార్పు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదొక సందర్భంలో చోటుచేసుకునే పదమిది. ఇప్పుడు ఇదే పదాన్ని సంగీత దర్శకుడు తమన్ కి అన్వయించుకోవలసిన పరిస్థితి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో దరువు పాటలకే ఎక్కువగా పరిమితమవుతూ వచ్చిన ఈ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడిప్పుడే తన శైలిని మార్చుకుంటుండడమే అందుకు కారణం.

తన కెరీర్ ప్రారంభం నుంచి నాలుగేళ్ల పాటు జోష్ ఉన్న పాటలకే.. అది కూడా రిపీటీడ్ మ్యూజిక్ తోనే హంగామా చేసిన తమన్.. నాగార్జున నటించిన 'గ్రీకువీరుడు' నుంచి తన బాణిని మార్చుకున్నాడు. ఆ సినిమా కోసం దాదాపుగా మెలోడీలను అందించిన ఈ యువ సంగీత దర్శకుడు.. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా. మెలోడీలకు ఉండే లైఫ్ టైమ్ ని అర్థం చేసుకుని ఇక మీదట మెలోడీలకే నా ప్రాధాన్యమన్నట్లుగా ఆ వైపుగానే అడుగులేస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

తాజాగా ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' కోసం 'జాబిల్లి నువ్వే చెప్పమ్మా..'తో పాటు తాజాగా విడుదలైన సాంగ్ మేకింగ్ వీడియో 'నేనెప్పుడైనా అనుకున్నానా..' కూడా మెలోడీగా ఉండడం చూస్తే. తమన్ లో క్రమేణా మార్పు సూచనలు కనిపిస్తున్నాయనిపిస్తోంది.  ఇది దర్శకుల వల్ల వచ్చిన మార్పో లేక మరోటో అనేది పక్కన పెడితే ఈ మార్పు తమన్ కెరీర్ మంచికేనని మాత్రం భావించవచ్చంటున్నారు సంగీత ప్రియులు.
సత్య2 ఆడియో ఆవిష్కరణ

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'సత్య-2' ఆడియో ఆవిష్కరణ
 Rahul-Chinmayi Love Story Successful
 'DK Bose' Arriving On 27 September
 'Satya 2' Audio Launched
 Amavasya A Ghosts Revenge Story
 శూన్యంగా రాబోతున్న చైతన్య
 Producer Tammareddy Krishna Murthy Passed Away
 Bhai Finishes Shooting
 Please Dont Target Films For Protests: NV Prasad
 Potugadu Rocking in USA
 Parcel A Mookie Thriller
 Sivajis Romantic Entertainer Underway
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.