1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

దళపతితో పోలుస్తున్నారు

IndiaGlitz [Thursday, September 05, 2013]
Comments

మణిరత్నం దర్శకత్వంలో రూపొంది తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం 'దళపతి'. ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.
 
ఇప్పుడు ఇదే శైలిలో మా సినిమా కూడా ఉంటుందని ఓ సినిమా యూనిట్ చెప్పుకొస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే.. చిన్న దళపతిగా పిలవబడే తమిళ స్టార్ హీరో విజయ్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోలుగా నటిస్తున్నచిత్రం 'జిల్లా'. నేసన్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
 
చిత్రీకరణ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది. 'దళపతి' తరహాలో ఓ తమిళ అగ్రకథానాయకుడు, ఓ మలయాళ కథానాయకుడు చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా మరో దళపతి అవుతుందన్న నమ్మకం ఉందని.. రేపు సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఇదే మాటని తప్పకచెబుతారని దర్శకుడు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వినాయక చతుర్థిన విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల అయ్యే అవకాశముంది.High Court Orders DGP To Ensure Safe Release Of Thoofan

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.