1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

దూసుకెళ్తాలో మిస్సయింది

IndiaGlitz [Tuesday, September 24, 2013]
Comments

హీరోగా పదేళ్ల కెరీర్ ని పూర్తి చేసుకుంటున్నా. మంచు వారి కథానాయకుడు విష్ణు కెరీర్ లో ఇప్పటివరకు ఉన్న విజయాల సంఖ్య రెండంటే రెండు. 2007లో రిలీజైన 'ఢీ'. 2012లో రిలీజైన 'దేనికైనా రెడీ' సినిమాలతో ఆ విజయాలు వరించాయి.

ఆ రెండు సినిమాల్లో ఉన్న కామన్ లెటర్, స్టార్టింగ్ లెటర్  డి అనే ఆంగ్లాక్షరం  మరోసారి వచ్చేలా. ఇప్పడు ముచ్చటగా మూడో విజయాన్ని పొందడానికి ఓ సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఆ సినిమా పేరు 'దూసుకెళ్తా'. 'దేనికైనా రెడీ' విడుదల తేదినే ఈ సినిమా కూడా రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అక్టోబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నదన్నమాట.

ఇదిలా ఉంటే. విష్ణుకి విజయాన్ని అందించిన ఆ రెండు సినిమాల్లో ఉన్న మరో కామన్ అంశం తాజా సినిమాలో మిస్సయ్యింది. అదేమిటంటే. ఢీ, దేనికైనా రెడీ సినిమాల కోసం చక్రి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తే. దూసుకెళ్తాకి మాత్రం మణిశర్మ బాణీలు సమకూర్చుతున్నాడు. చక్రి రహిత సినిమాగా వస్తున్న ఈ డి సెంటిమెంట్ ఉన్న చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిపుచ్చుకుంటుందో చూడాలి.
PBS Puraskar To MS Vishwanathan and Vani Jayaram

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.