close
Choose your channels

'పంచముఖి' ఫస్ట్ లుక్ లాంఛ్

Monday, May 19, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Panchamukhi Movie  Gallery
View Panchamukhi Movie Gallery

ఆర్ట్ ఇన్ హార్ట్ బ్యానర్ పై ఆర్యన్ రాజేష్, మాదాల రవి, ఉత్తేజ్, చిన్నా, సుమన్, కృష్ణుడు తదితర నటీనటులతో రూపొందుతున్న సినిమా ‘పంచముఖి’. యార్లగడ్డ కిరణ్ నిర్మాత. చల్లా భానుకిరణ్ దర్శకుడు. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ హైదరాబాద్ లో విడుదలైంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శకుడు చల్లా భానుకిరణ్ మాట్లాడుతూ..... దేవుడు, దెయ్యాన్ని ఎవరు చూడలేదు. కానీ అనుభంతో చెప్పిన సంఘటనలతో ఈ కథ రాసుకున్నాను. ఐదు మందికి ఎదురైన యదార్థ సంఘటనల కలయికే ఈ సినిమా. కొత్త ప్రయత్నమిది. ఐదు కథలకు లింక్ ఉంటుంది. సినిమాని అనుకున్న టైమ్ లో అనుకున్న బడ్జెట్ లో రెడీ చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.

నిర్మాత యార్లగడ్డ కిరణ్ మాట్లాడుతూ... కథను నమ్మి చేస్తున్న చిత్రమిది. ఐదుగురు హీరోలు, హీరోయిన్స్, ఐదు పాటలు, ఐదుగురు సంగీత దర్శకులు ఈ సినిమాకి పనిచేశారు. దర్శకుడు భానుగారు అనుకున్న సమయానికి సినిమాని అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Follow us on Google News and stay updated with the latest!