1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పల్లెటూరి పడుచుగా తమన్నా

IndiaGlitz [Sunday, November 17, 2013]
Comments

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రాలలో తమిళ సినిమా 'వీరమ్' ఒకటి. అజిత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'శౌర్యం, శంఖం, దరువు' చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ దర్శకత్వం వహిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న రెండో తమిళ సినిమా 'వీరమ్' .  గతంలో శివ దర్శకత్వం వహించిన తమిళ సినిమా 'సిరుతై' మంచి విజయం సాధించింది. తెలుగులో సూపర్ హిట్ అయిన 'విక్రమార్కుడు'కి రీమేక్ గా ఆ సినిమా తెరకెక్కగా.. అందులో తమన్నా నాయిక గా నటించింది. 'సిరుతై' తరువాత శివ, తమన్నా కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'వీరమ్'నే.

దీంతో తనకు కలిసొచ్చిన కథానాయికలలో ఒకరైన తమన్నా కోసం ఈ సినిమాలో ఓ మంచి పాత్ర ఇచ్చాడట శివ. 'వీరమ్'లో తమన్నాది పల్లెటూరి యువతి పాత్ర అని సమాచారం. లంగావోణీలలో కనువిందు చేస్తూ సందడి చేసే ఆ పాత్రలో తమన్నా.. మాస్ కి మరింత చేరువవుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది. 'ఆరంభం' వంటి హిట్ తరువాత అజిత్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా 'వీరమ్' విడుదల కానుంది.
Sachin Tendulkar Is Bharat Ratna Indeed: Director Maruthi

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Sachin Tendulkar Is Bharat Ratna Indeed...': Director Maruthi
 Ajith, Nayana Tara's 'Aata Arambham' In End of November
 Sri Hari's last film 'Siva Keshav' To Be Released On 5th December
 Write your review on Villa (Pizza-2)
 Maruthi Presents Green Signal To Come In December
 The Three Beauties Of Prema Ishq Kadhal
 Kottoka Vintha Releasing In November End
 Varna Epitomizes The Warrior Anushka Is: Team Varna
 Chiranjeevi Visits Venkatesh Yadavs Home
 Rajinikanths Vikrama Simha For Pongal
 Chaitanya Dantuluris Basanti Completes Shooting
 AADU MAGAADRA BUJJI in Overseas by CineGalaxy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.