'పవర్'గా రానున్న మాస్ మహారాజా..
Friday, January 24, 2014 • Telugu Comments

'బలుపు' హిట్ తర్వాత అదే సినిమాకి రైటర్ గా పనిచేసిన కె.యస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హన్సిక ఇందులో రవితేజ తో జత కడుతుంది. రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమెటెడ్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతుంది. కర్నాట కలో బడా  నిర్మాతగా పేరున్న రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ పవర్ డిసైడయ్యారు. విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో పోలీస్ గెటప్ లో రవితేజ న్యూ లుక్ తో కనపడుతున్నాడు. గతంలో విక్రమార్కుడులో పోలీస్ గా అలరించిన రవితేజ మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడేమోనని టాక్. ఈ సినిమాకి యస్.యస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు.