close
Choose your channels

'పవర్' సెన్సేషన్..

Wednesday, January 29, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ మహారాజా రవితేజ హీరోగా రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లి. బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'పవర్'. ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాని నిర్మిస్తుండగా కె.రవీంద్రనాథ్(బాబీ) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

మొదటి రెండు రోజుల్లోనే దాదాపు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. బలుపు సినమా రెండున్నర లక్షల వ్యూస్ రాగా ఈ సినిమాకి దానికి డబుల్ రెస్పాన్స్ రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. ఈ సంర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ 'మా 'పవర్' చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.

సినిమా ప్రారంభంలోనే రవితేజ తన పవరేంటో చూపించాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమా ఇది. అందరినీ తప్పకుండా అలరిస్తుంది' అని తెలిపారు. యస్.యస్.థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Follow us on Google News and stay updated with the latest!