1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పిజ్జా హీరో నుంచి మరోటి

IndiaGlitz [Monday, November 18, 2013]
Comments

తమిళంలో సంచలనం విజయం సాధించి.. తెలుగులోనూ అనువాద రూపంలో మంచి విజయం అందుకున్న సినిమా 'పిజ్జా'. థ్రిల్లర్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. తనలోని ఈజ్ తో ఇరుభాషల్లోనూ సదరు సినిమాతో ఆకట్టుకున్నాడు విజయ్. ప్రస్తుతం తమిళంలో పలు ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకుపోతున్న ఈ యువ కథానాయకుడు తెలుగు మార్కెట్ పైనా దృష్టిని కేంద్రీకరించే పనిలో పడుతున్నాడని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అందులో భాగంగా తన గత చిత్రం 'ఇదిర్ క్కాదనే ఆశపట్టాయ్ బాలకుమారా' అనే సినిమాని తెలుగులోకి అనువాద రూపంలోకి తీసుకురావడానికి విజయ్ పావులు కదుపుతున్నాడని సమాచారం. ఇందులో తెలుగమ్మాయి స్వాతి ఉండడం అనేది పబ్లిసిటీ ఫ్యాక్టర్ గా మరింత ఉపకరించే అంశం కావడంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు విజయ్ సేతుపతి. అతని తెలుగు మార్కెటింగ్ ప్లాన్ ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Nuvve Naa Bangaram Audio On 29th NovemberOther News


Amma Nanna Oorelite Releasing On 5th December

మనం సినిమాలో సర్ ప్రైజ్ గా

Puris Heart Attack Audio On 8th December

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.