1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బందిపోటు ప్రారంభం

IndiaGlitz [Tuesday, June 10, 2014]
Comments
View 'Bandipotu' Movie Launch Gallery
View 'Bandipotu' Movie Launch Gallery

అల్లరి నరేష్ హీరోగా ఇ.వి.వి.సినిమా బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా 'బందిపోటు'. ఆర్యన్ రాజేష్ నిర్మాతగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఈషా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. మూవీ మొఘల్ డి.రామానాయుడు క్లాప్ నివ్వగా డి.సురేష్ బాబు స్విచ్ఛాన్ చేశారు. తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ''ఇ.వి.వి.సత్యనారాయణ గారంటే నాకు చిన్నప్పట్నుంచి అభిమానం. ఆయన సినిములు చూస్తూ పెరిగాను. ఇ.వి.వి.బ్యానర్ లో పనిచేస్తున్న ఇతర దర్శకుల్లో నేను రెండవవాణ్ణి. నరేష్ ఇందులో కొత్తగా కనపడతాడు. ఈ సినిమా ఏ సినిమాకి స్కూప్ కాదు.  రీమేక్ సినిమా కాదు. కామెడి ప్రధానాంశంగా సాగే కథనం'' అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ ''అష్టాచమ్మా సినిమా చూసిన తర్వాత నుండి ఆయనతో సినిమా చేయాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. కథ వినగానే బాగా నచ్చడంతో మా బ్యానర్ లో సినిమా చేయాలని అనుకున్నాం. రాజేష్ నిర్మాతగా ఉంటూ, నటనలో కొనసాగుతాడు. నెగటివ్ రోల్స్ చేయాలని రాజేష్ చూస్తున్నాడు'' అన్నారు.

ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ ''మా బ్యానర్ లో సినిమా అంటే నాన్నగారి పేరు పెంచేలా ఉండాలని అనుకున్నాం. మోహనకృష్ణ ఇంద్రగంటి కథ చెప్పగానే బాగా నచ్చింది".
Not a spoof of NTRs Bandipotu : Allari Naresh

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.