close
Choose your channels

'బాహుబలి'లో తమన్నా

Friday, December 20, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్ నటించిన 'రెబల్' సినిమా కోసం అనుష్క కాదనుకున్న పాత్రలో నటించిన తమన్నా. ఇప్పుడు అదే ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా కోసం అనుష్కతో పాటు మరో నాయికగా నటించేందుకు ఓకే చెప్పింది. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా 'బాహుబలి' చిత్రంలో ప్రభాస్, అనుష్క జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఓ పాత్ర పేరు బాహుబలి కాగా. మరో పాత్ర పేరు శివుడు.

బాహుబలి పాత్ర సరసన దేవసేనగా అనుష్క నటిస్తుండగా. శివుడు పాత్ర సరసన అవంతిక పాత్రలో తమన్నా కన్ ఫర్మ్ అయ్యింది. రేపు (డిసెంబర్ 21) తమన్నా పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో తమన్నా నటిస్తున్న తొలి చిత్రమిది. 'రెబల్'తో ఆశించిన విజయం అందుకోలేకపోయిన ప్రభాస్, తమన్నాల జంట రెండోసారి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం.

Follow us on Google News and stay updated with the latest!