close
Choose your channels

'భాయ్' టీజర్ రివ్యూ

Saturday, August 17, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రిలయన్స్, అన్నపూర్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'భాయ్'. హ్యట్రిక్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు వీరభద్రం ఈ సినిమా ద్వారా నాగ్ ని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ని గమనిస్తే .భారీ లోకేషన్స్ చూపించారు.

దర్శకుడు చెప్పినట్లు నాగ్ మూడు లుక్స్ లో అలరించారు .డాన్ కి సంబధించిన గెటప్ ఒకటి కాగా, రెండవది పాతబస్తీలో లుక్. మూడవ లుక్ మాత్రం పాటల్లో కనపడింది. భాయ్ టైటిల్ సాంగ్.., “అట్మాస్పియర్ అలర్ట్ అయ్యిందంటే భాయ్ ఎంటరైనట్లే" "హైదరాబాద్ లో రెండే ఫేమస్ ఒకటి ఇరానీ ఛాయ్.. రెండు భాయ్.". "ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నేనేరా... "అనే డైలాగ్స్ వినిపిస్తాయి.

వీరభద్రం తన కొత్త మార్కుని చూపించే ప్రయత్నం చేశారు. నాగార్జున ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ ని బాగా డిజన్ చేశాడనే చెప్పాలి. సెప్టెంబర్ 1 న ఆడియో విడుదల కానుంది, అదే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు.

Follow us on Google News and stay updated with the latest!