close
Choose your channels

'మనం' కి ఆ సినిమా స్ఫూర్తా..?

Thursday, September 19, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మనం. ఇష్క్ దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో శ్రియ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. శుక్రవారం ఏఎన్నార్ 90వ జన్మదినం సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ రోజు (గురువారం) విడుదల చేశారు. చూడటానికి ముచ్చటగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది.

ఇందులో నాగచైతన్య తాత పాత్రలో.. నాగార్జున తనకి కొడుకు పాత్రలో... ఏఎన్నార్ మనవడి పాత్రలో కనిపించబోతున్నారని ఆ స్టిల్ ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాగా.. ఈ సినిమా 'ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమన్ బటన్' అనే సినిమా స్ఫూర్తితో తెరకెక్కుతోందని వినిపిస్తోంది. అయితే అందులో ఎంతమేరకు నిజముందో సినిమా విడుదలయ్యాక గానీ తెలియదు. లేదంటే చిత్రయూనిట్ చెప్పాలి. ఏ సినిమా ఇన్ స్ఫిరేషన్ అయినా చూడటానికి ఆహ్లాదంగా ఉంటే చాలు.. మనం కచ్చితంగా హిట్ సినిమా అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ మాత్రం ఫస్ట్ ఇన్ స్ఫిరేషన్ ఈజ్ బెస్ట్ ఇన్ స్ఫిరేషన్ అనేలా ఉంది.

Follow us on Google News and stay updated with the latest!