close
Choose your channels

'యూత్ ఫుల్ లవ్' ఆడియో విడుదల

Saturday, November 30, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నవీన్ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'యూత్ ఫుల్ లవ్'. మనోజ్ నందం, ప్రియదర్శిని నటీనటులు. రంజిత్ నిర్మాత. వేముగంటి దర్శకుడు. శ్రీకాంత్ దేవా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. దామోదర ప్రసాద్ ఆడియో సీడీలను ఆవిష్కరించగా తొలి సీడీని సునీల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ...

మనోజ్ నందం మాట్లాడుతూ 'నా చిత్రాలన్నింటిలోనూ ఇది హై బడ్జెట్ మూవీ. నా కెరీర్ కే ప్లస్ అవుతుంది. అందరికీ ముఖ్యంగా అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ అవసరమని తెలియచెప్పే సినిమా ఇది' అని అన్నారు.

దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ 'ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మార్షల్ ఆర్ట్స్ అవసరం తెలియజేస్తూ తీసిన సినిమా ఇది. నిర్మాత చాలా సపోర్ట్ చేశారు. మంచి సంగీతం కుదిరింది. కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్మకం ఉంది' అని చెప్పారు.

నిర్మాత రంజిత్ మాట్లాడుతూ 'మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి లోకేషన్లలో తెరకెక్కించాం. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం' అని అన్నారు.

హీరోయిన్ మాట్టాడుతూ 'ఇది నా రెండవ సినిమా. ఇది వరకు బెంగాళీ సినిమాల్లో నటించాను.సినిమా విజయం సాధించాలి' అని తెలిపారు.

Follow us on Google News and stay updated with the latest!