Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రూటు మార్చిన రంగం దర్శకుడు

IndiaGlitz [Monday, September 02, 2013]
Comments

'వీడొక్కడే', 'రంగం', 'బ్రదర్స్' వంటి తమిళ అనువాదాలతో తెలుగు ఆడియన్స్ కి చేరువయ్యారు కెమెరామెన్ నుంచి డైరెక్టర్ గా టర్న్ అయిన కె.వి.ఆనంద్..  సాధ్యమైనంత వరకు తన సినిమాల్లో కొత్త దనం ఉండేలా జాగ్రత్తలు తీసుకునే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజా సినిమా 'అనేగన్' కోసం చిరువిరామంతో మెగాఫోన్ పట్టారు.

ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమైరా నాయికగా కోలీవుడ్ కి పరిచయమవుతోంది 'వీడొక్కడే', 'రంగం', 'బ్రదర్స్' సినిమాలకు సంగీతమందించిన హారిస్ జైరాజే ఈ సినిమాకూ స్వరాలు సమకూర్చుతున్నారు. సీనియర్ నటులు కార్తీక్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అతుల్ కులకర్ణి, ఆశిష్ విద్యార్థి ప్రతినాయకుల పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇదిలాఉంటే.. ఆనంద్ గత చిత్రాలు 'కన కండేన్' (తెలుగులో కర్తవ్యంగా అనువాదమైంది), అయన్' (వీడొక్కడే), 'కో' (రంగం), 'మాట్రాన్ '(బ్రదర్స్)  కోసం వరుసగా గోపిక, తమన్నా, కార్తీక, కాజల్ వంటి దక్షిణాదితో అనుబంధం ఉన్న భామలు నాయికలుగా నటిస్తే తాజా సినిమాలో మాత్రం ఏ మాత్రం సౌత్ తో టచ్ లేని అమైరాకి హీరోయిన్ గా అవకాశం దక్కింది.

కథ డిమాండ్ మేరకే బాలీవుడ్ అమ్మడిని ఆనంద్ ఎంచుకున్నా. తాజా సినిమాతో హీరోయిన్ల పరంగా అతని రూట్  మారినట్లయ్యింది. సహజంగానే కె.వి.ఆనంద్ సినిమాలు ఇక్కడా అనువాదమవుతాయి కాబట్టి అనేగన్ పుణ్యమా అని అమైరా గ్లామర్ విందును మనమూ దర్శించుకోవచ్చన్న మాట..




మొండోడు కు పూరి 'స్వరం'





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Will she replace Samantha ?
 'Ice Cream 2' audio launch in Vijayawada
 Swathi responds on her marriage rumours
 Charmme's 'Mantra 2' in last leg of shooting
 Rakul Preet gives an explanation
 Pawan Kalyan will attend GAV's 150th day function : Chiranjeevi
 Spotted : Arnold Schwarzenegger at Chennai airport
 'Govindudu Andarivadele' Songs List
 A big year ahead for Ramya Krishna
 'A Shyam Gopal Varma Film' getting ready for release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.