'రేయ్' ఆడియోకి అతిథిగా పవన్...
Wednesday, January 1, 2014 • Telugu Comments

తెలుగు తెరకు పరిచయం కానున్న మరో స్టార్ సాయిధరమ్ తేజ్. వైవియస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రేయ్'లో కథానాయకుడు. సయామి ఖేర్, శ్రద్ధాదాస్ లు నాయికలు. అనేక అడ్డంకులను దాటి సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల విడుదలైన ఫీలర్ కి మంచి స్పందన వచ్చింది. సినిమా ఆడియోను కూడా ఈనెల మొదటి వారంలో  విడుదల చేస్తున్నారు.

ఒకానొక సందర్భంలో సినిమా అడ్డంకులను పవన్ సాయంతో అధిగమించి విడుదల చేస్తున్నామని దర్శకుడు వైవియస్ కూడా సెలవిచ్చాడు. అలాగే ఆడియో వేడుకకు పవన్ ను ఆహ్వనించారట. పవన్  సైతం ఓకే అన్నట్లు సమాచారం. చూడాలి మరి! పవన్ కల్యాణ్ వస్తాడో రాడో. పవన్ ఆడియోకి వస్తే మాత్రం సినిమాపై అంచనాలు పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.