close
Choose your channels

'రేసుగుర్రం' రేసులో లేదా?

Sunday, November 17, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు అర్జున్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం 'రేసుగుర్రం'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రేసుగుర్రం' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా ముగ్గుల పండక్కీ వచ్చే అవకాశం దాదాపుగా లేదనే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో.

వారు చెబుతున్న కహానీ ఏమిటంటే.. సంక్రాంతి రేసులో ఇప్పటికే మెగాఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ హీరోగా 'ఎవడు'.. సాయిధరమ్ తేజ హీరోగా 'రేయ్' సినిమాలు ఉండడం వల్ల 'రేసుగుర్రం' విడుదలని సంక్రాంతి నుంచి ఫిబ్రవరి లేదా మార్చి నెలలోకి మార్చారని వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంత మేరకు నిజముందో త్వరలోనే తెలుస్తుంది.

Follow us on Google News and stay updated with the latest!