close
Choose your channels

'లెజెండ్' రికార్డ్స్

Wednesday, March 12, 2014 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నందమూరి బాలకృష్ణ హీరోగా వారాహిచలనచిత్రం, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘లెజెండ్’. సోనాల్ చౌహాన్, రాధికాఅప్టే హీరోయిన్స్. బోయపాటి శ్రీను దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన సినిమా ఆడియో ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

లయన్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్ తో నడివనున్న ఈ సినిమా ఇప్పటి నుండి రికార్డ్స్ క్రియేట్ చేసే దిశలో నడుస్తుంది. సింహా వంటి క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మరో సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. ఇప్పటికే ట్రైలర్స్ అప్ లోడ్ చేసిన 24 గంట్లోనే 2 లక్షల క్లిక్స్ సాధించింది. ఈ సినిమాలో బోయపాటి కుమార్తె జోషిత కీలకపాత్ర పోషిస్తుంది. సినిమాను ఈ నెల 28న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Watch Legend Trailers

Follow us on Google News and stay updated with the latest!