close
Choose your channels

'సచిన్' ట్రైలర్ ఆవిష్కరణ

Tuesday, May 20, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View 'Sachin' Press Meet Gallery
View 'Sachin' Press Meet Gallery

సుభాష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుహాసిని, స్నేహిత్, వెంకటేశ్ ప్రసాద్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘సచిన్’ టెండూల్కర్ కాదు. తానికొండ వెంకటేశ్వర్లు నిర్మాతగా యస్.మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది. కర్నాటక ఫిలిమ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ ట్రైలర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...

సుహాసిని మాట్లాడుతూ "నేను పుట్టి పెరిగింది తమిళనాడు, 285 సినిమాలు చేశాను. అందులో 100 సినిమాలు తెలుగు సినిమాలే. నన్ను తెలుగు ప్రేక్షులు ఎక్కువగా ఆదరించారు, అందుకే తెలుగు ప్రేక్షకులను కలవడమంటే నాకు చాలా ఇష్టం. నాకు రియలిస్టిక్ గా ఉండే సినిమాలంటేనే ఇష్టం. కాబట్టే సచిన్ సినిమా చేశాను. స్నేహిత్ నటన బాగా చేవాడు. తన నటనకి నేషనల్ అవార్డు రావాల్సిందే. వెంకటేశ్ ప్రసాద్ మంచి రోల్ చేశారు. క్రికెట్, హ్యుమన్ రిలేషన్స్, విలువలు ఉన్న సినిమా. అందరికి నచ్చుతుంది" అన్నారు.

దర్శకుడు యస్.మోహన్ మాట్లాడుతూ "మెంటల్లి ఛాలెంజింగ్ కుర్రాడి పాత్రలో స్నేహిత్ చక్కగా చేశాడు. ఆటిజం సమస్యతో బాధపడే పిల్లాడుకి చెందిన కథ. క్రికెట్ కోచ్ గా వెంకటేశ్ ప్రసాద్, స్నేహిత్ అక్కగా సుహాసిని బాగా నటించారు. తప్పకుండా అందరికి నచ్చే సినిమా ఇది" అన్నారు.

ఈ సినిమాకి సంగీతం: రాజేష్ రామనాథ్, కెమెరా: ప్రసాద్ బాబు, నిర్మాత: తాడికొండ వెంకటేశ్వర్లు, దర్శకత్వం: యస్.మోహన్.

Watch Sachin Tendulkar Kadhu Trailers