1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హవా కొనసాగిస్తున్న నజ్రీయా

IndiaGlitz [Tuesday, November 19, 2013]
Comments

తెలుగునాట కనీసం ఒక్కటంటే ఒక్క సినిమా చేయకపోయినా.. 'నయ్యాండి' అనే ధనుష్ నటించిన తమిళ సినిమా వివాదం కారణంగానూ.. దానికి నయనతార స్పందన కారణంగానూ గుర్తింపును పొందేసింది కేరళకుట్టి నజ్రీయా నజీమ్. చూడడానికి పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ మలయాళ మగువ తన మాతృభాషతో పాటు తమిళంలోనూ 'నేరం, రాజా రాణి' వంటి హిట్ సినిమాలతో బాగానే అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. సినిమాల సంఖ్య కూడా అటు తమిళంలోనూ, ఇటు మలయాళంలోనూ బాగానే ఉంది అమ్మడికి.

ఇదిలాఉంటే..  సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ పరంగా నజ్రీయా తన హవాని బాగానే కొనసాగిస్తోంది. రెండు మూడు నెలల క్రితం వరకు ఓ మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న నజ్రీయా.. కాలచక్రం గిర్రున రెండు మూడు నెలలు తిరిగేటప్పటికీ ఆ సంఖ్యని రెండింతలు చేసుకుని.. రెండు మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని.. తనకున్న క్రేజ్ ఏ పాటిదో చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ అమ్మడు తెలుగులోనూ సినిమాలు చేయడం మొదలెడితే.. లైక్స్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు ఆమె అభిమానులు.
Ide Charutho Dating Audio Launch SoonOther News


Ori Devudoy Song Compositions By Koti In The USA

Pratinidhi Trailers and Audio Super Hit

Unify Creations new Film Maine Pyar Kiya

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.