close
Choose your channels

'హార్ట్ ఎటాక్' రిలీజ్ అప్పుడేనా?

Friday, December 13, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

థియేటర్ల కొరత కారణంగా. సంక్రాంతి నుంచి విడుదలను వాయిదా వేసుకుంటున్నట్లుగా 'హార్ట్ ఎటాక్' సినిమా గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' వంటి రెండు విజయాలతో ఊపు మీదున్న నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి. ఇప్పుడు ఓ కొత్త తేది కుదిరిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇంతకీ ఆ తేది ఏమిటంటే. ప్రేమికులకు ప్రీతిపాత్రమైన వాలైంటెన్స్ డే (ఫిబ్రవరి 14). యాక్షన్ తో కూడుకున్న లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'హార్ట్ ఎటాక్' దాదాపుగా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా ఆదా శర్మ హీరోయిన్ గా పరిచయమవుతుండగా. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

ఈ సినిమాతో తన కెరీర్ లోనే తొలిసారిగా హ్యాట్రిక్ హిట్ దొరుకుతుందన్న ఆశతో ఉన్నాడు నితిన్. అది నెరవేరుతుందో లేదో తెలియాలంటే. ప్రస్తుతం విడుదల తేదిగా చెప్పుకొస్తున్న ఫిబ్రవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow us on Google News and stay updated with the latest!