close
Choose your channels

'హ్యాపీ డేస్' భామకి మరో ఆఫర్

Tuesday, December 3, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'హ్యాపీడేస్' చిత్రం కోసం.. శ్రావ్స్ పాత్రలో మెరిసి యువతను ఆకట్టుకుంది ఉంగరాల జుట్టు సుందరి సోనియా దీప్తి. ఆ తరువాత 'వినాయకుడు' సినిమా కోసం కృష్ణుడుకి జతగా నటించి హీరోయిన్ గానూ ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.... తరువాతి కాలంలో మాత్రం హీరోకి ఫ్రెండ్ గానో.. హీరోయిన్ కి ఫ్రెండ్ గానో కనిపించడాన్ని అలవాటు చేసుకుంది.

తమిళంలో 'పయ్యా'గా రూపొంది తెలుగులో 'ఆవారా'గా అనువాదమయిన సినిమా కోసం హీరో కార్తీకి ఫ్రెండ్ పాత్రలో మెరిసిన సోనియా.. మహేష్ బాబు హీరోగా నటించిన 'దూకుడు' కోసం సమంతకి స్నేహితురాలి పాత్రలో సందడి చేసింది. ఇప్పుడు ఇదే వరుసలో మరో సినిమా కోసం స్నేహితురాలి వేషాన్ని సొంతం చేసుకుందట ఈ బ్లాక్ బ్యూటీ. అయితే ఈ సారి ఆమె ఎంచుకున్నభాష కన్నడం అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ కన్నడంలో రూపొందిస్తున్న తొలి చిత్రమైన 'నిన్నిందలే' కోసం సోనియా ఇలాగే ఫ్రెండ్ పాత్రలో సందడి చేయబోతోంది. పునీత్ రాజ్కుమార్, ఎరికా ఫెర్నాండేజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on Google News and stay updated with the latest!