close
Choose your channels

'రాజా రాణి' సక్సెస్ మీట్

Tuesday, March 18, 2014 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్య, నయనతార జంటగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఎ.ఆర్.మురగదాస్ ప్రొడక్షన్, ది నెక్ట్స్ బిగ్ ఫిలిమ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'రాజారాణి'. అట్లీకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ స్వరాలందించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో.

ఎ.ఆర్.మురగదాస్ మాట్లాడుతూ' తమిళంలో గతేడాది విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. మంచి కలెక్షన్స్ సాధించింది. తెలుగు ప్రేక్షకులు సైతం సినిమాని ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అట్లీ డైరక్షన్ బాగుంది. ఆర్య,నయనతార, జై, నజ్రీయా నటన సినిమాకి ప్లస్ అయ్యాయి' అన్నారు.

అట్లీ మాట్లాడుతూ 'తమిళంలో పెద్ద హిట్టై 60 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లను రాబడుతుంది. విడుదలైన నాలుగురోజుల్లోనే నాలుగు కోట్లు సంపాదించింది. ఈ సినిమాని హిట్ చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులు నాకు ఎనర్జీనిచ్చారు.' అన్నారు.

ఆర్య మాట్లాడుతూ 'తమిళంలో ఆదరించిన విధంగానే తెలుగు ప్రేక్షకులు సైతం సినిమాని ఆదరించారు. సాధారణమైన రొమాంటిక్ కామెడీ సినిమాని భారీ బడ్జెట్ తో తీశారు. నయనతార అద్భుతంగా నటించింది. తెలుగులోనూ ఆదరిస్తున్న అందరికి థాంక్స్' అన్నారు.

Follow us on Google News and stay updated with the latest!