close
Choose your channels

'1' తో అదీ తీరుతుందట

Tuesday, December 17, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఇలా వరుసగా మూడు విజయాలతో నెంబర్ వన్ కథానాయకుడు అనే దిశగా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ఆ విజయాల పరంపర కోసం మహేష్ చేస్తున్న మరో ప్రయత్నమే '1 నేనొక్కడినే'. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మైక్రో టీజర్ 'హు ఆర్ యూ' అంటూ సందడి చేసిన సంగతి తెలిసిందే.ఆ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు. మహేష్ బాబు రాక్ స్టార్ గా అదరగొట్టాడంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే. చాన్నాళ్లుగా మహేష్ బాబు అభిమానులకు ఉన్న ఓ చిన్న లోటు ఈ సినిమాతో తీరనుందని సమాచారం.

అదేమిటంటే. బాలనటుడిగా ఉన్నప్పుడు తన నృత్యాలతో ఆబాలగోపాలాన్ని అలరించిన మహేష్. హీరోగా మారాక తొలి దశలో మినహాయిస్తే ఎప్పుడూ తనలోని డ్యాన్సర్ కి ఎక్కువగా పనిచెప్పలేదని. అది '1' తో సాధ్యమైందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఎనర్జిటిక్ బాణీలకు. మహేష్ బాబు స్టెప్ లు తోడైతే '1' కి ఉండే స్పందన ఎలా ఉంటోందో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచిచూడాలంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

Follow us on Google News and stay updated with the latest!