close
Choose your channels

కళ్యాణ్ రామ్ హీరోయిజానికి 12 ఏళ్లు..

Friday, October 9, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2015.. ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తోంది. అయితే ఈ సంవ‌త్స‌రంలో ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే ప‌దానికి శ్రీ‌కారం చుట్టిన సినిమా మాత్రం 'ప‌టాస్‌'. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమాతో బాక్సాఫీస్‌కి కొత్త‌ ఉత్సాహాన్నిచ్చారు. అతి త్వ‌ర‌లో 'షేర్' సినిమాతో మ‌రోసారి స‌క్సెస్‌ని పొందేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (అక్టోబ‌ర్ 9) క‌ళ్యాణ్ రామ్ కి వెరీ స్పెష‌ల్ డే. ఎందుకంటే.. స‌రిగ్గా 12 ఏళ్ల క్రితం అంటే 2003లో ఇదే రోజున ఉషాకిర‌ణ్ మూవీస్ నిర్మించిన 'తొలి చూపులోనే' సినిమాతో ఈ నంద‌మూరి అంద‌గాడు హీరోగా వెండితెర‌పై అరంగేట్రం చేశాడు. రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిస్తూ వ‌చ్చిన క‌ళ్యాణ్ రామ్‌.. హీరోగా ఇప్ప‌టివ‌ర‌కు 11 చిత్రాల‌లో అల‌రించ‌గా..త‌న హీరోయిజానికి 12 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంలో..12వ చిత్రం 'షేర్' తో ఈ నెల 30న ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆల్ ది బెస్ట్ టు క‌ళ్యాణ్ రామ్‌!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.