close
Choose your channels

18న 'గ్రీన్ సిగ్నల్' ఆడియో

Sunday, April 13, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

View Green Signal Gallery

View Green Signal Gallery

ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పణ లో మారుతి టాకీస్, ఎస్.ఎల్.వి సినిమా సంయుక్తంగా రుద్రపాటి రమణరావు నిర్మాణంతో రూపొందుతున్న సినిమా 'గ్రీన్ సిగ్నల్'. డింపుల్, మధురిమ శ్రావ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రేవంత్, మానస్, గోపాల్ సాయి, ఆశుతోష్, రక్షిత, శిల్పిశర్మ, మనాలి, రాథోడ్, భార్గవి నటీనటులు. విజయ్ ముద్దాల దర్శకుడు. జె.బి.సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత రుద్రపాటి రమణ రావు మాట్లాడుతూ 'విజయ్ కథ చెప్పిన వెంటనే నచ్చింది. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కుతుంది.టాకీ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆద్యంతం ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సోసైటిలోని ప్రాబ్లమ్స్ ను చూపించాం. సినిమాకి స్వామి సినిమాటోగ్రఫీ ప్లస్ అవుతుంది. జె.బి.అద్భుతమైన సంగీతం అందించాడు. సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో ఈ నెల 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్ః ఉద్ధవ్, కెమెరాః ఆర్.ఎమ్.స్వామి, సంగీతంః జె.బి., నిర్మాతః రుద్రపాటి రమణరావు, కథ, స్ర్కీన్ప్లే, దర్శకత్వంః విజయ్ ముద్దాల

Follow us on Google News and stay updated with the latest!