close
Choose your channels

నరుడా డోనరుడా - 2 మిలియన్ వ్యూస్..!

Monday, October 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కించారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను కింగ్ నాగార్జున, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఎలా ఉంటుందో అని ఆస‌క్తిగా ఎదురుచూసారు.
అయితే... ఈ ట్రైల‌ర్ అంద‌రి అంచ‌నాల‌ను మించి ఊహించ‌ని విధంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్ ఛాన‌ల్ లో 514 K వ్యూస్, ఫేస్ బుక్ లో 1.5 మిలియ‌న్ వ్యూస్ మొత్తం క‌లిపి 2 మిలియ‌న్ కి పైగా వ్యూస్ సాధించింది సంచ‌ల‌నం సృష్టించింది. వీర్య‌దానం అనే కాన్సెప్ట్ ఆడియోన్స్ కు కొత్త‌గా ఉండ‌డంతో బాగా ఆక‌ట్టుకుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని రిలీజ్ డేట్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్ట‌ర్ మ‌ల్లిక్ రామ్ & నిర్మాత సుప్రియ త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నున్నారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కి వ‌చ్చిన రెస్పాన్స్ కి చాలా హ్యాపీగా ఫీల‌వుతూ నిర్మాత సుప్రియ ఆడియోన్స్ కు థ్యాంక్స్ తెలియ‌చేసారు.
సుమంత్, ప‌ల్ల‌వి సుభాష్, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్, జ‌బ‌ర్ధ‌స్త్ శేషు, సుంక‌ర ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు త‌దిత‌రులు న‌టించిన‌ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్ట‌ర్ - రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ - కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, సినిమాటోగ్రాఫ‌ర్ - శానియ‌ల్ డియో, ఎడిట‌ర్ - కార్తీక్ శ్రీనివాస్, సంగీతం - శ్రీచ‌ర‌ణ్ పాక‌ల‌, లైన్ ప్రొడ్యూస‌ర్ - డా.అనిల్ విశ్వ‌నాథ్, ప్రొడ్యూస‌ర్స్ - వై.సుప్రియ‌, జాన్ సుధీర్ పూధోట‌, డైరెక్ట‌ర్ - మ‌ల్లిక్ రామ్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.