close
Choose your channels

20 నుంచి సూర్య సినిమా షూటింగ్

Sunday, November 17, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది జులై ప్రథమార్థంలో విడుదలైన 'సింగం 2' (తెలుగులో 'సింగం') తరువాత.. కొన్ని నెలలుగా మేకప్ కి దూరంగా ఉంటున్న తమిళ నటుడు సూర్య.. ఇప్పుడిప్పుడే మేకప్ కి చేరువవుతున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం కోసం ఇటీవలే ఫొటోషూట్ లలో పాల్గొని.. విజయవంతంగా ఆ పనిని కానిచ్చిన సూర్య.. ఈ నెల 20 నుంచి ముంబాయిలో నిరవధికంగా సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

ఈ సినిమా కోసం సమంత తొలిసారిగా హీరో సూర్యతోనూ , దర్శకుడు లింగుస్వామితోనూ కలిసి పనిచేయబోతోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. తమ్ముడి(కార్తీ)కి 'పయ్యా ' (తెలుగులో 'ఆవారా') రూపంలో మంచి విజయాన్ని అందించిన లింగుస్వామి అన్నయ్యకి మరి ఏ రేంజ్ లో హిట్ నిస్తాడో చూడాలంటో వచ్చే సంవత్సరం ద్వితీయార్థం వరకు వేచిచూడాల్సిందే.

Follow us on Google News and stay updated with the latest!