close
Choose your channels

20న తుఫాన్ పాటలు

Wednesday, August 14, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ చరణ్ తొలి బాలీవుడ్ ఎంట్రీ తుఫాన్. ఆ సినిమాతో కాప్ గా బీ టౌన్ కు ఎంటరవుతున్నాడు చరణ్.ట్రయిలర్స్ చూసిన వారు తుఫాన్ లో కాప్ డ్రస్ చరణ్ కు పక్కాగా సెట్ అయిందని ప్రశంసిస్తున్నారు.అమితాబ్ నటించిన మేటి చిత్రం జంజీర్ కు ఇది రీమేక్ అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చరణ్ పక్కన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించింది.
చరణ్ కు హిందీ యాక్సెంట్ నేర్పించి సాయం కూడా చేసింది. ఇటీవల ఈ సినిమాకు చరణ్ డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశాడు. ప్రకాష్ రాజ్ కూడా డబ్బింగ్ చెప్పేశాడట. ఈ సినిమా ఆడియో తెలుగు వర్షన్ ఈ నెల 20న జరగనుంది.ఇంతకు ముందు ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 6న సినిమా విడుదల కానుంది. అంటే సెప్టెంబర్ నుంచి మెగా అభిమానుల మధ్య పండగ సందడి కనిపించనుంది.
జంజీర్, అత్తారింటికి దారేది, తుఫాన్ సినిమాలు వరుసగా సందడి చేయనున్నాయి. ఏదేమైనా ఇటీవల మన హీరోలు బాలీవుడ్ లో సందడి చేస్తున్నారు. మొన్నటికి మొన్న రానా, ఇప్పుడు చరణ్, రేపు రవితేజ... దక్షిణాది హీరోలు ఉత్తరాది కథలకు సరిపోతారనే నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు.

Follow us on Google News and stay updated with the latest!