close
Choose your channels

21న 'నా రాకుమారుడు'

Saturday, February 15, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నవీన్ చంద్ర, రీతువర్మ జంటగా నటించిన సినిమా నా రాకుమారుడు. సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ను ఇచ్చింది. ఈ సినిమాను 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా గురించి నవీన్ చంద్ర మాట్లాడుతూ "తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదు. దాని తర్వాతే ఎవరి ప్రేమ అయినా, ఎవరి ప్రేమ అయినా. నేను నిజ జీవితంలో అలాగే భావిస్తాను. అలాంటి పాత్రనే ఈ సినిమాలోనూ చేస్తున్నాను" అని అన్నారు. మంచి సినిమా అని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. మంచి సినిమాలో నటించడం తన అదృష్టమని రీతువర్మ చెప్పింది. పాటలకు మంచి స్పందన వస్తోందని, 21న సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.

Follow us on Google News and stay updated with the latest!