23న 'ఎక్స్ మెన్'
Tuesday, May 20, 2014 • Telugu Comments
View X Men Gallery
View X Men Gallery

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రై.లి. సంస్థ నుండి వస్తున్న మరో అద్భుత చిత్రం ‘ఎక్స్ మెన్’. ఎక్స్ మెన్ సిరీస్ లో 7వ చిత్రమిది. తొమ్మిది అద్భుతమైన శక్తులు కలిసి మానవాళిని రక్షేంచే చిత్రం. రాబోయే కాలంలో ఎలాంటి శక్తుల వల్ల మానవులకు ప్రమాదం వాటిల్లనుందో వాటిని ముందుగానే పసిగట్టి తొమ్మిది విచిత్రమైన శక్తులు గల వ్యక్తులతో ప్రపంచ ఫీచర్ ను మారుస్తారు.

ఇలాంటి చిత్రవిచిత్రమైన అద్భుత శక్తులతో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించగలం అని నిరూపించే మహత్తర చిత్రం. ప్రపంచ దేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మే 23న తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో భారీగా విడదలకు ముస్తాభవుతుందని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రతినిథి తెలిపారు.