close
Choose your channels

అఖిల్ - కార్తీ చేతుల మీదుగా సూర్య 24 ఆడియో, ట్రైలర్ విడుదల

Monday, April 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్య, మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ క్రేజీ మూవీ 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంగా రూపొందిన 24 మూవీని హీరో సూర్య నిర్మించ‌డం విశేషం. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతాన్ని అందించారు. 24 మూవీ అటు త‌మిళ్ - ఇటు తెలుగులో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకుంది. ఈ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న 24 మూవీ త‌మిళ్ వెర్ష‌న్ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం ఈరోజు ఉద‌యం చెన్నైలో జ‌రిగింది. 24 తెలుగు వెర్షెన్ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం ఈరోజు సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించ‌డం విశేషం.
24 మూవీ ట్రైల‌ర్ ను అక్కినేని అఖిల్ రిలీజ్ చేయ‌గా... హీరో కార్తీ ఆడియో సి.డి ని ఆవిష్క‌రించి తొలి సి.డి ని నిర్మాత డి. సురేష్ బాబుకు అంద‌చేసారు.
గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ మాట్లాడుతూ...రెహ‌మాన్ గారి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో అన్నిపాట‌లు రాసే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్, హీరో సూర్య గార్కి మ‌న‌స్పూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను. ఈ సినిమాలోని పాట‌లు ఆత్మ సంతృప్తి క‌లిగించాయి అన్నారు.
న‌టుడు అజ‌య్ మాట్లాడుతూ....డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ నాకు ఇష్క్ సినిమాలో మంచి రోల్ ఇచ్చారు. ఇప్పుడు 24 మూవీలో కూడా మంచి పాత్ర ఇచ్చినందుకు ధ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. సూర్య వండ‌ర్ ఫుల్ ప్రొడ్యూస‌ర్. సూర్య‌తో క‌ల‌సి చాలా స‌న్నివేశాల్లో న‌టించాను. 24 మూవీలో న‌టించినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... సూర్య డిఫ‌రెంట్ ఫిల్మ్స్ చేస్తుంటారు. ముఖ్యంగా సినిమాల రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. 24 మూవీ చేయ‌డం అనేది గొప్ప ప్ర‌య‌త్నం. ఈ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న 24 మూవీ స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు 24 టీమ్ అన్నారు.
డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ...రెహ‌మాన్ గార్ని ఇంత ద‌గ్గ‌రగా చూస్తాన‌నుకోలేదు. ఈ ఆడియో వేడుక‌లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. కార్తీ స‌పోర్ట్ తో అనుకోకుండా త‌మిళ్ డైరెక్ట‌ర్ అయ్యాను. ఊపిరి త‌మిళ ఆడియో ఫంక్ష‌న్ లో సూర్య గారు నా గురించి మాట్లాడుతుంటే... తెలియ‌ని అనుభూతి క‌లిగింది. 24 టీజ‌ర్ చూసాను. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. 24 మూవీ ఖ‌చ్చితంగా కుమ్మేస్తుంది అన్నారు.
నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ... సూర్య సినిమా సినిమాకి కొత్త‌ద‌నం చూపిస్తూ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నారు. రెహ‌మాన్ కూడా త‌న ప్ర‌తి సినిమాకి కొత్త‌గా సంగీతం అందిస్తుంటాడు. ఆల్ ది బెస్ట్ టు 24 మూవీ టీమ్ అన్నారు
మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ మాట్లాడుతూ...నేను రెహ‌మాన్ గార్కి బిగ్ ఫ్యాన్. అలాగే సూర్య సార్ కి కూడా బిగ్ ఫ్యాన్, 24 మూవీ మ‌నకు విజువ‌ల్ ట్రీట్. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బ‌ష్ట‌ర్ అవుతుంది అన్నారు.
డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ మాట్లాడుతూ....ఇది చాలా గొప్ప స్టోరీ అని తెలుసు. ఈమ‌ధ్య కాలంలో ఏ సినిమా కోసం ఇంత‌గా వెయిట్ చేయ‌లేదు. నా ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్, అలాగే హీరో సూర్య‌, స‌మంత‌, రెహ‌మాన్ ఇలా గొప్ప టీమ్ తో రూపొందిన 24 మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు
హీరోయిన్ స‌మంత మాట్లాడుతూ...24 మూవీ అంద‌రికీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. 24 టీమ్ గురించి చెప్పేంత ఎక్స్ పీరియ‌న్స్ నాకు లేదు. రెహ‌మాన్ గారు నా కెరీర్ లో ఫ‌స్ట్ సినిమా ఏమాయ చేసావే నుంచి నాకు లైఫ్ ఇచ్చేసారు. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ సినిమాలో నా న‌ట‌న బాగా రిజిష్ట‌ర్ అవుతుంది అనుకుంటున్నాను. విక్ర‌మ్ కుమార్ క‌థ చెప్పిన‌ప్పుడు భ‌య‌ప‌డ్డాను. కానీ..విక్ర‌మ్ కుమార్ క‌థ చెప్పిన దానికంటే బాగా తీసారు. సూర్య గారు ఈ సినిమాలో మూడు విభిన్న పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాని సూర్య మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. ఇది పూర్తిగా సూర్య సినిమా అన్నారు.
అక్కినేని అఖిల్ మాట్లాడుతూ...గ‌జ‌ని సినిమా చూసి ఏక్ట‌ర్ అంటే ఇలా ఉండాలి అనుకున్నాను. సూర్య, రెహ‌మాన్ గారి స‌మ‌క్షంలో ఈ ఫంక్ష‌న్ లో పాల్గొడం గ్రేట్ ఎక్స్ పీరియ‌న్స్. స‌మంత నా ఫేవ‌రేట్ ఏక్ట‌ర‌స్. ఈ సినిమాలో కంటెంట్ క‌నిపిస్తుంది. సూర్య సార్ చాలా డిఫ‌రెంట్ రోల్స్ చేసారు. సూర్య సార్ ఇన్ స్పిరేష‌న్ తో నా నెక్ట్స్ మూవీలో డిఫ‌రెంట్ గా క‌నిపించ‌డానికి ట్రై చేస్తాను అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ...ఊపిరి సినిమాకి మీరంద‌రూ ఇచ్చిన స‌పోర్ట్ కి థ్యాంక్స్. 24 టైటిల్ బ్రిలియంట్ టైటిల్. క‌థ విన్న త‌ర్వాత ఎందుకు ఈ టైటిల్ పెట్టారా అనిపించింది. గంట త‌ర్వాత ఎందుకు ఈ టైటిల్ పెట్టారో తెలిసింది. వండ‌ర్ ఫుల్ టైటిల్. డైరెక్ట‌ర్ ఓ కొత్త క‌థ త‌యారు చేసి మ‌న‌ల్ని24 మూవీ ద్వారా కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళుతున్నారు. ఇది బ్యూటీఫుల్ స్ర్కిప్ట్. అన్న‌య్య ఈ సినిమాలో మూడు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ లో క‌నిపిస్తారు. హీరో, విల‌న్, మ‌రో క్యారెక్ట‌ర్. రెహ‌మాన్ సార్ ని అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్న‌ప్పుడు క‌లిసాను. ఆయ‌నే నాకు స్పూర్తి. ఏ నిర్ణ‌యం అయినా తీసుకునే ముందు ప్రేమ‌తో తీసుకుంటే... లైఫ్ పీస్ ఫుల్ గా ఉంటుంది అని చెప్పారు. ఆయ‌న చెప్పిన దాన్ని పాటిస్తున్నాను. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో అజ‌య్ క్యారెక్ట‌ర్ సూప‌ర్ గా ఉంది అన్నారు.
డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ మాట్లాడుతూ...ఈ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చినందుకు సూర్య గార్కి థ్యాంక్స్. రెహ‌మాన్ సార్ తో వ‌ర్క్ చేయ‌డం వండ‌ర్ ఫుల్ ఎక్స్ పీరియ‌న్స్. ఎంత టెన్ష‌న్ ఉన్నా ఐదు నిమిషాలు రెహ‌మాన్ సార్ తో మాట్లాడితే ప‌దిరోజులకు స‌రిప‌డా ఎన‌ర్జీ వ‌స్తుంది. రెహ‌మాన్ సార్ తో భ‌విష్య‌త్ లో మ‌రిన్ని చిత్రాల‌కు వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నాను. చంద్ర‌బోస్ మంచి సాహిత్యం అందించారు. నిత్యామీన‌న్ ఈ ఫంక్ష‌న్ కి రావాల‌నుకుంది. కానీ..కొన్ని కార‌ణాల వ‌ల‌న రాలేక‌పోయింది. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు.
రెహ‌మాన్ మాట్లాడుతూ...దేశ‌విదేశాల్లో ఉన్న‌తెలుగు వారంద‌ర‌కీ థ్యాంక్స్. నా కొడుకు అమీన్ తొలి పాట‌ తెలుగులో పాడాడు. న‌న్ను ఆశీర్వ‌దించిన‌ట్టే అమీన్ ను కూడా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను.సూర్య‌, విక్ర‌మ్ క‌ల‌సి 24 అనే మంచి సినిమా అందిస్తున్నారు. బెస్ట్ విషెష్ టు 24 టీమ్ అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ... ఈ సినిమా నా కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. మ‌నం సినిమా త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ వ‌చ్చి నాలుగున్న‌ర గంట‌ల పాటు క‌థ చెప్పారు. క‌థ పూర్తి అయిన త‌ర్వాత నిలుచుని చ‌ప్ప‌ట్లు కొట్టాను. అంత‌లా ఈ క‌థ న‌న్ను ఆక‌ట్టుకుంది. రెహ‌మాన్ సార్ పాజిటివ్ ఎన‌ర్జి ఈ సినిమా బాగా రావ‌డానికి హెల్ప్ అయ్యింది. షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు అజ‌య్ ఖ‌చ్చితంగా ఇది డిఫ‌రెంట్ ఫిల్మ్ సూప‌ర్ హిట్ అవుతుంద‌ని చెప్పేవాడు. ఈ ఆడియో వేడుక‌కు వ‌చ్చిన కొర‌టాల శివ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ డూప‌ర్ ఫిల్మ్ అవుతుంది. హైద‌రాబాద్ ఎప్పుడు వ‌చ్చినా నాపై ప్రేమ చూపిస్తున్నందుకు మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. నాకు మీ ప్రేమ కావాలి. ఆశీస్సులు కావాలి అన్నారు. నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్, నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, జెమిని కిర‌ణ్, ఎగ్జిబ్యూట‌ర్ స‌దానంద్ గౌడ్, అమిత్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.