close
Choose your channels

27న తుఫాన్ పాటలు

Saturday, August 24, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ చరణ్ తొలి బాలీవుడ్ ఎంట్రీ తుఫాన్. ఆ సినిమాతో కాప్ గా బీ టౌన్ కు ఎంటరవుతున్నాడు చరణ్. ట్రయిలర్స్ చూసిన వారు తుఫాన్ లో కాప్ డ్రస్ చరణ్ కు పక్కాగా సెట్ అయిందని ప్రశంసిస్తున్నారు. అమితాబ్ నటించిన మేటి చిత్రం జంజీర్ కు ఇది రీమేక్ అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో చరణ్ పక్కన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించింది. చరణ్ కు హిందీ యాక్సెంట్ నేర్పించి సాయం కూడా చేసింది. ఇటీవల ఈ సినిమాకు చరణ్ డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశాడు.ప్రకాష్ రాజ్ కూడా డబ్బింగ్ చెప్పేశాడట.

ఈ సినిమా ఆడియో తెలుగు వర్షన్ ఈ నెల 27న జరగనుంది. ఇంతకు ముందు ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 6న సినిమా విడుదల కానుంది. అంటే సెప్టెంబర్ నుంచి మెగా అభిమానుల మధ్య పండగ సందడి కనిపించనుంది. తుఫాన్ కు సంబంధించి అఫిషియల్ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు కూడా ఓపనయ్యాయి.

Follow us on Google News and stay updated with the latest!