close
Choose your channels

27న 'హార్ట్ ఎటాక్' సెన్సార్

Monday, January 27, 2014 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూత్ స్టార్ నితిన్, ఆదాశర్మ జంటగా నటిస్తున్న సినిమా 'హార్ట్ఎటాక్'. పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా పూరి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా అనూప్ స్వరాలందిస్తున్నాడు ఇటీవల పూరి సంగీత్ ద్వారా విడుదలైన ఈ సినిమా ఆడియో మంచి టాక్ ని సంపాదించుకుంది. ఈ నెల 31న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవలే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. జనవరి 27న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకోనుంది. కామెడీ ఎంటర్ టైనర్, ఫ్యామిలీ మల్టీస్టారర్ గా రానున్న మంచువారి పాండవులు పాండవులు తుమ్మెదతో ఈ సినిమా పోటీపడనుంది. ఈ సినిమాలో నితిన్ ను కొత్త లుక్ లో చూపించనున్నాడు పూరి.

మరి ఈ సినిమా నితిన్ కి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో తెలియాలంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకి సంగీతం: అనూప్, పాటలుః భాస్కరభట్ల, కెమెరాః అమోల్ రాథోడ్, కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: పూరిజగన్నాథ్.

Follow us on Google News and stay updated with the latest!