close
Choose your channels

30 నుంచి హార్ట్ ఎటాక్

Monday, August 12, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నితిన్ హీరోగా నటించనున్న సినిమా హార్ట్ అటాక్. పూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చేనెల 30 నుంచి షూటింగ్ జరుగనుంది. పూరి సొంత నిర్మాణ సంస్థ వైష్ణో అకాడమీలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పోకిరి తర్వాత ఆ సంస్థలో పూరి నిర్మిస్తున్న సినిమా ఇదే.
వరుసగా రెండు సినిమాలతో జోరుమీరున్న నితిన్ కు ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. హార్ట్ ఎటాక్ ఎవరికి, ఎందుకు వచ్చిందనేది ఆసక్తికరం. ఇటీవల ఇద్దరమ్మాలయిలతో, దేవుడుచేసిన మనషులు అని తెలుగు టైటిల్స్ పెట్టిన పూరి ఈ సినిమాకు తన పాత ఫార్ములా ప్రకారం హార్ట్ ఎటాక్ అని పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Follow us on Google News and stay updated with the latest!