close
Choose your channels

వెంకటేష్ శ్రీనివాస కళ్యాణంకి 30 ఏళ్లు

Monday, September 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ చిత్ర సంస్థ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే.. ఆ సినిమా కచ్చితంగా మ్యూజిక‌ల్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉండేది అప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు. దానికి త‌గ్గ‌ట్టే ఆ సంస్థ అధినేత కె.మురారి చివ‌రి వ‌ర‌కు అలాంటి మ్యూజిక‌ల్ హిట్స్ ని ఇచ్చి మురిపించారు. ఆయ‌న నిర్మించిన దాదాపు ప్ర‌తి చిత్రానికి కె.వి.మ‌హ‌దేవ‌న్ సంగీత‌మందించారు. అలా కె.మురారి, కె.వి.మ‌హ‌దేవ‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఓ మ్యూజిక‌ల్ హిట్ శ్రీ‌నివాస క‌ళ్యాణం.

వెంక‌టేష్‌, భానుప్రియ‌, గౌత‌మి హీరోహీరోయిన్లుగా కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ యువ చిత్ర వారి సినిమా.. మ్యూజిక‌ల్‌గానే కాదు క‌మ‌ర్షియ‌ల్‌గానూ మంచి హిట్ అయ్యింది. ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ముగ్గురూ త‌మ న‌ట‌న‌తో సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకువెళ్లారు. కె.వి.మ‌హ‌దేవ‌న్ అందించిన పాట‌లన్నీ ఆణిముత్యాలే. ఎందాకా ఎగిరేవ‌మ్మా గోరింకా, తుమ్మెదా ఓ తుమ్మెదా పాట‌లైతే సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. 30 ఏళ్ల క్రితం అంటే.. 1987లో ఇదే సెప్టెంబ‌ర్ 25న ఈ సినిమా విడుద‌లైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.