close
Choose your channels

'ప్రభంజనం' ఆడియో విడుదల

Monday, February 3, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చైతన్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై బాస్కర రావు వేండ్రాతి స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందతున్న సినిమా 'ప్రభంజనం'. రంగం ఫేమ్ అజ్మల్, సందేశ్, ఆరూషి, పంచిబోర నటీనటులు. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో శనివారం హైదరాబాద్ లో విడుదలైంది.

ఈ కార్యక్రమానికి గొల్లపూడి మారుతీరావు, కోదండరామిరెడ్డి, జె.డి.లక్ష్మీనారాయణ, బి.గోపాల్, ఎస్.గోపాల్ రెడ్డి, దశరథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కోటి, ప్రసన్నకుమార్, మల్టీడైమన్షన్ వాసు తదితరులు హాజరైనారు. బిగ్ సీడీని, ట్రైలర్సను జె.డి.లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ లు ఆవిష్కరించి తొలి సీడీని సిరివెన్నెల సీతారామశాస్ర్తిగారికి అందించారు.

Follow us on Google News and stay updated with the latest!