Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

'మనం' 50 డేస్ విజయోత్సవ వేడుకలు

IndiaGlitz [Tuesday, July 15, 2014]
Comments

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇలా మూడు తరాలు కలిసి తెలుగు తెరపై సందడి చేసిన సినిమా మనం.  తెలుగు సినిమా చరిత్రలో మూడు తరాలు నటులు కలిసి నటించిన తొలి చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఇటీవల 50 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా విజయోత్సవ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా..

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘’మనం సినిమా చేసేటప్పుడు నాన్నగారు నటిస్తున్న చివరి చిత్రమని మా అందరికీ తెలుసు. చాలా బాధపడేవాళ్లం. అయన ఎంత కష్టపడి షూటింగ్ కి వచ్చేవారో నాకు తెలుసు. ఇంత కష్టపడుతున్నారు. సినిమా ఎలా ఉంటుందోనని లోపల ఎక్కడో చిన్న టెన్షన్ ఉండేది. కానీ వరల్డ్ వైడ్ గా పెద్ద హిట్టవడంతో ఈ సందర్భంలో నాన్నగారు ఉండుంటే చాలా బాధగా ఉంది.  విక్రమ్ ఈ సినిమాని ఒక దృశ్యకావ్యంలా మలిచాడు. తను ఎప్పుడు సినిమా గురించే ఆలోచిస్తాడు. అందుకే మనం వంటి ఒక ఫీల్ గుడ్ మూవీ తెరకెక్కించగలిగాడు. పి.యస్.వినోద్ సినిమాకి తన కెమెరావర్క్ తో గ్రాండ్ నెస్ తెచ్చాడు. మేం 120 రోజులు పడ్డ కష్టం తను అఖిల్ ను స్ర్కీన్ పై చక్కగా చూపించి క్రెడిట్ అంతా కొట్టేశాడు. రాజీవన్ తెరపై మ్యాజిక్ చేశాడు. అనూప్ సినిమాకి అత్మలా నిలిచే సంగీతాన్ని అందించాడు. తనతో ఇంత వరకు పనిచేయలేదు కదా ఎలా చేస్తాడో అని అనుకున్న కానీ విక్రమ్ తన మంచి సంగీతాన్నిస్తాడని నాకు భరోసా ఇచ్చాడు అన్నట్లుగానే అనూప్ ఎక్సలెంట్ సంగీతాన్ని ఇచ్చాడు. అభిమానులు, ప్రేక్షకులు, మీడియా ఇలా ప్రతి ఒక్కరు ఈ సినిమాని తమ సినిమాగా భావించారు. కాబట్టే ఇవాళ సినిమా 85 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఇది మనందరి మూవీ అని చెప్పుకునేలా ఒక మంచి చిత్రాన్ని మాకందరికి కానుకగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీ తరపున థాంక్స్’’  అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, యార్లగడ్డ, అక్కినేని వెంకట్, నాగసుశీల, సుప్రియ, సుశాంత్, మహేశ్వర్ రెడ్డి, కె.రాఘవేంద్రరావు, నాగచైతన్య, అఖిల్ తో పాటు చిత్రయూనిట్ సభ్యులు తదితరులు హాజరైనారు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ కి మెమొంటోలను అందజేశారు.

Watch Manam Trailers
దాసరి 'ఎర్రబస్సు'

Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.
Other News

 Nani replaces Rana Daggubati
 'Pawanism' release date fixed
 Kona Venkat to direct Ravi Teja ?
 Akhil becomes brand ambassador of Titan
 Aishwarya Rai & SRK's pair COMING UP???
 Music World Mourns 'Mandolin Srinivas' Demise
 'Aagadu' crosses 1 million mark in USA
 It started three years back between RGV and Sreenu Vaitla
 'Govindudu Andarivadele' censor on 22nd
 'Aagadu' creates all time records
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.