close
Choose your channels

64 వ జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాల హవా

Friday, April 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 64వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో `పెళ్లిచూపులు` సినిమా రెండు జాతీయ అవార్డుల‌ను గెలుచుకుంది. ఉత్త‌మ తెలుగు చిత్రం కేట‌గిరితో పాటు, ఉత్త‌మ సంభాష‌ణ‌లకుగాను ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ జాతీయ అవార్డుకు ఎంపిక‌య్యాడు. ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తాగ్యారేజ్ చిత్రానికి ఉత్త‌మ నత్య ద‌ర్శ‌కుడుగా రాజు సుంద‌ద‌రం ఎంపిక‌య్యారు. ఉత్త‌మ న‌టుడుగా బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ఎంపిక‌కాగా, ఉత్త‌మ‌న‌టిగా సుర‌భి ల‌క్ష్మి ఎంపిక‌లయ్యారు.

64వ జాతీయ అవార్డుల వివ‌రాలుః

ఉత్త‌మ హిందీ చిత్రం - నీర్జా
ఉత్త‌మ న‌టుడు - అక్ష‌య్‌కుమార్‌
ఉత్త‌మ‌న‌టి - సుర‌భి ల‌క్ష్మి(మిన్నా మినుంగు)
ఉత్త‌మ స‌హాయ న‌టి - జైరా వాసిమ్ (దంగ‌ల్‌)
ఉత్త‌మ దర్శ‌కుడు - రాజేష్ (వెంటిలేట‌ర్‌)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - బాపు ప‌ద్మ‌నాభ‌(అల్ల‌మ‌)
ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్ చిత్రం - శివాయ్‌
ఉత్త‌మ సంభాష‌ణ‌లు - త‌రుణ్ భాస్క‌ర్ (పెళ్ళిచూపులు)
ఉత్త‌మ క‌న్న‌డ చిత్రం - రిజర్వేష‌న్‌
ఉత్త‌మ సామాజిక చిత్రం - పింక్‌
ఉత్త‌మ త‌మిళ చిత్రం - జోక‌ర్
ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రం - శ‌త‌మానం భ‌వ‌తి
ప్ర‌త్యేక జ్యూరీ అవార్డు - మోహ‌న్ లాల్‌( జ‌న‌తాగ్యారేజ్‌, పులిమురుగ‌న్‌)
ఉత్త‌మ మ‌ల‌యాళ చిత్రం - మ‌హెశింతె ప్ర‌తీకారం
ఉత్త‌మ ప‌రిచ‌య ద‌ర్శ‌కుడు - దీప్ చౌద‌రి
ఉత్త‌మ బాలల చిత్రం - ధ‌న‌క్‌(హిందీ)
ఉత్త‌మ బాల‌న‌టుడు - అదిష్ ప్ర‌వీణ్‌(కుంజు దైవ‌మ్‌), సాజ్‌(నూర్ ఇస్లాం), మ‌నోహ‌ర్ (రైల్వే చిల్డ్ర‌న్‌)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు - సుంద‌ర అయ్య‌ర్‌(జోక‌ర్‌)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని - తుమి జాకీ
ఉత్త‌మ స్క్రీన్ ప్లే - శ్యామ్ పుష్క‌రన్ (మ‌హెషంతి ప్ర‌తీకారం)
ఉత్త‌మ ఎడిటింగ్ - రామేశ్వ‌ర్ (వెంటిలేట‌ర్‌)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.