close
Choose your channels

క్రెడిట్ అంతా మణిరత్నంగారికే దక్కతుంది - అదితిరావు హైదరీ

Monday, April 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కార్తీ, అదితిరావు హైద‌రీ జంట‌గా న‌టించిన ఇంటెన్స్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీ `చెలియా`. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై మద్రాస్‌ టాకీస్‌ రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సంద‌ర్భంగా అదితిరావు హైద‌రీ మాట్లాడుతూ.. మణిరత్నంగారితో పనిచేయడం ఓ కల నిజమైనట్లుగా భావిస్తున్నాను. అయినా ఛాలెంజింగ్స్‌ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం. అలాంటి ఛాలెంజింగ్‌రోల్ చెలియాలో చేశాను.
మణిరత్నం వంటి దర్శకులతోపనిచేసేటప్పుడు ఆయన నటుడుకి ఇవ్వాల్సిన స్వేచ్చను, స్పేస్‌ను ఇచ్చి లిమిట్స్‌ను దాటి మ‌న అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఓ కొత్త క్యారెక్టర్‌ను మనకు మనముగా కనుగొనే అవకాశం ఏర్పడుతుంది. సుహాసినిగారు ఆడియో వేడుకలో చేసిన అప్రిసియేషన్‌ క్రెడిట్‌ అంతా మణిరత్నంగారికే చెందుతుంది. నేను సినిమాలో ఏదీ చేసినా ఆయన చలవే. మణిగారి దర్శకత్వంలో సినిమా చేశాననడం ఈరోజుకు కూడా కలలాగానే ఉంది. సంజయ్‌దత్‌గారితో భూమి సినిమా చేస్తున్నాను. అలాగే పద్మావతి మూవీలో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చిందీ హైద‌రాబాద్ బ్యూటీ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.