close
Choose your channels

మొన్న మహేష్..నిన్న ఎన్టీఆర్..నేడు చరణ్..

Friday, October 9, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యాక్ష‌న్‌కి కామెడీని మిక్స్ చేయ‌డంలో శ్రీ‌నువైట్ల‌ది అందెవేసిన చెయ్యి. అందుకే త‌న కెరీర్‌లో విజ‌యాల శాతం ఎక్కువ‌. గతేడాది 'ఆగ‌డు'తో ప‌రాజ‌యం ఎదురైన‌ప్ప‌టికీ.. రెట్టించిన ఉత్సాహంతో వైట్ల చేసిన 'బ్రూస్ లీ' ఈ నెల 16న విడుద‌ల కానుంది. పాజిటివ్ బ‌జ్‌తో ఉన్న ఈ సినిమా.. శ్రీ‌ను వైట్ల హిట్ చిత్రాల లిస్ట్‌లో చేరుతుంద‌ని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓవ‌ర్‌సీస్‌లో తొలి 'మిలియ‌న్ డాల‌ర్' సినిమాని 'దూకుడు' రూపంలో అందించిన ద‌ర్శ‌కుడుగా వైట్ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది.

ఆ త‌రువాత త‌న నుంచి వ‌చ్చిన‌ 'బాద్ షా', 'ఆగ‌డు' చిత్రాల‌తోనూ ఆ మార్క్‌ని అవ‌లీల‌గా చేరుకున్నాడు. ఈ నేప‌థ్యంలో వైట్ల కొత్త చిత్రం కూడా ఆ ప‌రంప‌రని కొన‌సాగిస్తుందేమో చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో ఓవ‌ర్‌సీస్ ప‌రంగా ఒక్క మిలియ‌న్ డాల‌ర్ మూవీ కూడా లేదు. 'దూకుడు'తో మ‌హేష్‌కి.. 'బాద్‌షా'తో ఎన్టీఆర్‌కి.. తొలి మిలియ‌న్ డాల‌ర్ క్రెడిట్స్‌ని ఆపాదించిన వైట్ల‌.. చ‌ర‌ణ్‌కి కూడా అందిస్తాడేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.