close
Choose your channels

మెగా హీరోతో అక్కినేని వారసుడు ఫైట్...

Saturday, July 18, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య నిర్మాతగా ఓ కామెడి, యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలభై శాతానికి పైగా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పనులను పూర్తి చేసుకుంటుంది. అఖిల్ డెబ్యూ కావడంతో వినాయక్ అండ్ టీమ్ సినిమాని పకడ్బందీగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాని కూడా దసరాకే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే రెండు సినిమాలు దసరాకి రానున్నాయి. అంటే తొలి సినిమాకే అఖిల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను పోటీ పడుతున్నాడు. కొన్ని రోజులు ఆగితే అఖిల్ సినిమా రిలీజ్ డేట్ కూడా తెలిసిపోతుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.