close
Choose your channels

అఖిల్ నెక్స్ ట్ సినిమాకు డేట్ ఫిక్సయ్యింది...

Saturday, March 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ హీరోగా వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన అఖిల్‌, బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డంతో రెండో చిత్రానికి అఖిల్ చాలా టైం తీసుకున్నాడు. మ‌నం సినిమా డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సినిమాను అన్న‌పూర్ణ సంస్థ నిర్మించ‌నుంది.
ఈ సినిమాను ఏప్రిల్ 3న లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ట‌. యూత్‌ఫుల్ స్టోరీస్‌లో ట్రెండ్ క్రియేట్ అయ్యేలా ఈ స్టోరీ ఉంటుంద‌ని నాగార్జున అల్రెడి ఓ సంద‌ర్భంలో చెప్పి ఉండ‌టంతో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ అనుకున్నారు కానీ..తాజాగా అఖిల్ స‌ర‌స‌న మ‌రో హీరోయిన్‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.