close
Choose your channels

అఖిల్ సినిమా కొత్త టైటిల్...

Wednesday, June 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని అఖిల్ హీరోగా మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన యాక్ష‌న్ పార్ట్ అంతా పూర్త‌య్యింది. హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఈ సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముందు `జున్ను` అనే టైటిల్ పెట్టాల‌ని రిజిష్ట‌ర్ కూడా చేయించారు. అయితే ఇప్పుడు విన‌ప‌డుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు `హ‌లో గురూ ప్రేమ కోస‌మే` అనే టైటిల్ దాదాపు క‌న్‌ఫ‌ర్మ్ అయ్యిందంటున్నారు. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రానుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.